నేలకొరిగిన మొక్కజొన్న పంట

Praja Tejam
0


 కనేకల్లు ప్రజాతేజం ఏప్రిల్ 09
  ప్రకృతి విలయానికి కనేకల్ మండలంలోని పలు గ్రామాల్లో  గాలి వానలకు మొక్కజొన్న పంట నేలమట్టం అయింది  దాదాపు వందలాది ఎకరాల్లో ఈ పంట నష్టపోయారు రైతన్నలు. బుధవారం సాయంత్రం కురిసిన గాలి వానలకు మండల పరిధిలోని కనేకల్ క్రాస్  మరియు పుల్లంపల్లి పూలచెర్ల కొత్తపల్లి గ్రామాల్లోని మొక్కజొన్న పంట నేలకు ఒరిగింది కొత్తపల్లి గ్రామానికి చెందిన హనుమంత రెడ్డి అనే రైతు నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాడు  ఈ పంట మొత్తం నేల నేలమట్టమయింది  అలాగే పుల్లంపల్లి వీరేశ్ అనే రైతు  పొలం కూడా నీలమట్టమయింది ఏపుగా  పెరిగిన మొక్కజొన్న పంటను చూసి రైతు సంతోషపడేలోపే ప్రకృతి యమపాశం గా తయారై  వాన గాలి రూపంలో రైతును చావు దెబ్బ కొట్టింది  కనేకల్ మండలంలోని వందల ఎకరాల్లో పంట నష్టపోయుంటారని రైతులు తెలిపారు అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి  ప్రభుత్వమే ఆదుకునేలా చేయాలని రైతులు కోరుతున్నారు

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">