విశాఖలో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
- వెబ్‌సైట్ ప్రారంభం
-అమరావతిమే 23 (ప్రజాతేజమ్): రాష్ట్రంలో నెల రోజుల పాటు యోగాంధ్ర-2025 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఉండవల్లిలోని తన నివాసంలో బుధవారం ఈ కార్యక్రమానికి సంబంధించిన వెబ్‌సైట్‌ను ప్రారంభిం చారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ యోగాపై ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకువచ్చే విధంగా ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రపంచానికి భారతదేశం అందిస్తున్న గొప్ప వరం యోగా అని, అది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని అన్నారు. దేశానికి యోగా వారసత్వంగా వస్తోందని, భారతీయ జీవన విధానంలో ఒక భాగంగా మారిందని అన్నారు. యోగా ఒక ప్రాంతానికి, మతానికి సంబంధించినది కాదన్నారు. జూన్ 21వ తేదిన విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ రానున్నారని చెప్పారు. ఆ రోజు ఆర్‌కె బీచ్ నుంచి భోగాపురం వరకు 5లక్షల మందితో ఉదయం 7 నుంచి 8 గంటల వరకు యోగా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అదేసమ యంలో రాష్ట్రవ్యాప్తంగా 2కోట్ల మందికి తగ్గకుండా ఆ కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మొరార్జీ దేశారు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగాతో అసోసియేట్ చేసుకుని 2వేల మంది యోగా శిక్షకులను తయారు చేస్తామన్నారు. 10 లక్షల మందితో యోగా కోర్సులు చేయించి వారికి సర్టిఫికేట్లు కూడా అందజేయాలని నిర్ణయించా మన్నారు. యూనివర్సిటీలు, పబ్లిక్, ప్రైవేట్ సంస్థల్లోని వాలంటీర్లు, మహిళలు, వృద్ధులు, పోలీసులు, ఉద్యోగులు యోగా దినోత్సవంలో భాగ స్వాములు కావాలని కోరారు. యోగా ప్రాముఖ్యతను పాఠశాల సిలబస్‌లో పొందుపరుస్తామన్నారు.