జాబ్ మేళాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలి

Praja Tejam
0



- : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్
అనంతపురం, ఏప్రిల్ 15 (ప్రజా తేజమ్) :
- జిల్లాలో జాబ్ మేళాల నిర్వహణపై అన్ని శాఖల అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో 4వ జిల్లా నైపుణ్య కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు.
- ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో ఏప్రిల్, మే, జూన్ కి సంబంధించి మూడు నెలల్లో 8 జాబ్ మేళాలను నిర్వహించాల్సి ఉందని, సోషల్, బీసీ, ట్రైబల్ వెల్ఫేర్, స్కిల్ డెవలప్మెంట్, డిఆర్డిఏ, ఇతర అన్ని శాఖల అధికారులు జాబ్ మేళాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించిన కార్యచరణను అమలు చేయాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం దగ్గరికి వస్తోందని, ఆయా శాఖలకి సంబంధించిన బడ్జెట్ వస్తోందని, పనులు జరుగుతున్నాయని, వాటిని వేగంగా కొనసాగించాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు పరిశ్రమలను టైయప్ చేయాలని, ఉద్యోగ సౌకర్యాల కల్పనపై కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పీఎం విశ్వకర్మ యోజన కింద శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, పీఎం విశ్వకర్మ వాట్సాప్ గ్రూప్ తయారు చేయాలన్నారు. పీఎం విశ్వకర్మ యోజన కింద జిల్లాలో 205 బ్యాచ్ లకు సంబంధించి 6,004 మంది విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరగగా, 111 మందికి శిక్షణ కొనసాగుతోందన్నారు. పీఎం విశ్వకర్మకు సంబంధించి జిల్లా నుంచి జాతీయ అవార్డు కోసం దరఖాస్తు చేయాలన్నారు. విశ్వకర్మ పథకంపై డిఎస్డివో, జిఎం డిఐసి పూర్తిగా దృష్టి పెట్టాలని, శిక్షణ కేంద్రాలను తనిఖీ చేయాలని, శిక్షణ కేంద్రాలు పూర్తి సమర్థవంతంగా పనిచేసేలా చూడాలని ఆదేశించారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కింద కేటాయించిన లక్ష్యాలను ఎప్పటికప్పుడు చేరుకోవాలన్నారు. జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ ల్యాబ్ ను ఏర్పాటు చేయనుండగా, ఇందుకు సంబంధించిన పనులను వేగంగా చేపట్టాలన్నారు.

- అనంతరం 2025 - 26 సంవత్సరంలో మొదటి క్వార్టర్ జాబ్ మేళా క్యాలెండర్ కి సంబంధించిన పోస్టర్ లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతపురం అర్బన్ కి సంబంధించి ఏప్రిల్ 25వ తేదీన, రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి మే 2వ తేదీన, కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించి మే 16వ తేదీన, రాయదుర్గం నియోజకవర్గానికి సంబంధించి మే 23వ తేదీన, గుంతకల్లు నియోజకవర్గం సంబంధించి మే 30వ తేదీన, తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించి జూన్ 6వ తేదీన, సింగనమల నియోజకవర్గానికి సంబంధించి జూన్ 13వ తేదీన, ఉరవకొండ నియోజకవర్గంకు సంబంధించి జూన్ 27వ తేదీన జాబ్ మేళాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.

- ఈ సమావేశంలో డీఆర్డీఏ పిడి ఈశ్వరయ్య, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ప్రతాపరెడ్డి, జేఎన్టీయూ ప్లేస్మెంట్ సిఈఏ శ్రీనివాసులు, ఎస్కేయు అధికారి డా.సిహెచ్.కృష్ణ, మెప్మా పిడి విశ్వజ్యోతి, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీనివాస యాదవ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాధిక, డిటిడబ్ల్యుఓ రామాంజనేయులు, బిసి కార్పొరేషన్ ఈడీ సుబ్రహ్మణ్యం, జిల్లా ఉపాధి కల్పనా అధికారి కళ్యాణి, లేబర్ అసిస్టెంట్ కమిషనర్ రమాదేవి, ప్రభుత్వ ఐటిఐ బాయ్స్ ప్రిన్సిపల్ రామమూర్తి, రూడ్ సెట్ డైరెక్టర్ విజయలక్ష్మి, అయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">