నేడు బెలుగుప్పలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక

Praja Tejam
0


ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీలను స్వీకరించనున్న రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక,వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్

బెలుగుప్ప మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్

ఉరవకొండ: ఏప్రిల్ 08 (ప్రజాతేజం)

ఈనెల 9వ తేదీన బుధవారం బెలుగుప్పలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం,పిజిఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని బెలుగుప్ప మండల కేంద్రంలోని వాసవి కల్యాణ మండపం పక్కన ఉన్న స్థలంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని,ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ వివరాలతోపాటు వారి సమస్యలకు సంబంధించి అర్జీలను అందజేయాలని సూచించారు. బెలుగుప్ప మండల ప్రజలు ప్రత్యేక పిజిఆర్ఎస్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">