ప్రకాశం బ్యారేజీని సందర్శించిన కేంద్ర బృందం

Praja Tejam
0

 Facebook


విజయవాడ: ప్రకాశం బ్యారేజీని కేంద్ర బృందం సందర్శించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నష్టం సంభవించింది. ఇటీవల కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఏపీ, తెలంగాణలలో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. గురువారం కేంద్ర బృందం బ్యారేజీని పరిశీలించింది. బ్యారేజీ నీటి ప్రవాహం తదితర విషయాలను జలవనరుల శాఖ అధికారులు కేంద్ర బృందానికి వెల్లడించారు. ఈఎస్‌సీ వెంకటేశ్వర్లు ఇందుకు సంబంధించిన వివరాలను అందించారు. ఈ నెల 1న రికార్డ్‌ స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందన్నారు. కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో పరిస్థితి, ముంపునకు సంబంధించిన వివరాలను ఈ బృందం దృష్టికి తీసుకువెళ్లారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">